ఎమ్మెల్యే సహాకారంతో సీసీ రోడ్డు
– నిర్మాణ పనులు ప్రారంభించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభయ్యాయి. బుధవారం టీఆర్ఎస్ నేతలు పనులను ప్రారంభించారు. డీఎంఎస్టీ నిధులు రూ. 5.50 లక్షలతో బసవేశ్వర నగర్ నుంచి ఈశ్వరుని ఆలయ మార్గంలో సీపీ రోడ్డును పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా భారీగా నిధులను సాధించి అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, నేతలు నర్సిరెడ్డి, పటేల్ ఉమాశంకర్, తాండూరు మాజీ వైస్ ఎంపీపీ తుప్పుడు శేఖర్, వీరశైవ సమాజం పెద్దలు జొన్నల బస్వరాజ్, వాలి శాంతు కుమార్. శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

