వీరశైవ సమాజంలో నూతన కార్యవర్గం
– ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం
– అధ్యక్ష, కార్యదర్శులు ఎవరంటే.. ?
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరులోని వీరశైవ సమాజంలో ఇటీవలే జరిగిన ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల తరువాత కొత్త కార్యవర్గం ఎవరనేదానిపై ఆసక్తి ఏర్పడింది. సమాజం కొత్త కార్యవర్గం ఏర్పాటుకు తెరపడింది. గురువారం తాండూరులోని వీరశైవ సమాజం నూతన కార్యవర్గం కొలువు దీరింది. సమాజం అధ్యక్షులుగా ఆర్. బస్వరాజ్, ప్రధాన కార్యదర్శిగా లింగదలి రవికుమార్, గౌరవాధ్యక్షులుగా వాలి శాంతుకుమార్, ఉపాధ్యక్షులుగా సడి భద్రణ, సహాయ కార్యదర్శిగా అబులం సంపత్ కుమార్, కోశాధికారిగా వాలి శ్రావణ్ కుమార్ లు నియామకం అయ్యారు. ఈ మేరకు సమాజం ఎన్నికల అధికారి సమక్షంలో తాండూరు కార్యాలయంలో నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి…


