ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు

క్రైం తాండూరు వికారాబాద్

ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు
– తమ్మున్ని గొడ్డలితో నరికి చంపిన అన్న
– అనంతరం పోలీసులకు లోంగుబాటు
– యాలాల మండలంలో కలకలం
తాండూరు, దర్శిని ప్రతినిధి: అన్నదమ్ముల మద్య తలెత్తిన ఆస్తితగాదాలు ప్రాణం తీశాయి. అన్న సొంత తమ్మున్ని గొడ్డలితో నరికి చంపేశాడు. హత్య తరువాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగసముందర్ గ్రామానికి చెందిన గుబ్బ వెంకటేష్‌, గుబ్బ రవి(33)లు అన్న దమ్ములు. గత కొన్ని రోజులుగా ఇద్దరు అన్నదమ్ముల మద్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు అన్నదమ్ముల మద్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అన్న వెంకటేష్‌ తమ్ముడు రవిపై గొడ్డలితో దాడి చేశారు. రవి మెడపై ఇతర చోట్ల తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో రవి కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

హత్య తరువాత అన్న పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. హత్య విషయం తెలిసిన యాలాల ఎస్ఐ అరవింద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురుకి తరలించారు. మృతుని కుటుంభీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage