స్కూళ్లలో సీపీఆర్‌పై ట్రైనింగ్‌..!

ఆరోగ్యం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

స్కూళ్లలో సీపీఆర్‌పై ట్రైనింగ్‌..!
– ప్రాథమిక పాఠ్యాంశంగా పెట్టాలని ఆలోచన
– కార్యాచరణకు కసరత్తు చేస్తున్న సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మద్య కాలంలో అధికమవుతున్న గుండెపోటు మరణాలను నియంత్రించాలని భావిస్తోంది. ఇప్పటికే వైద్య శాఖలో, పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల్లోని అధికారులకు, సిబ్బందికి సీపీఆర్‌ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్కూల్‌ విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయింతీసుకోబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో స్కూల్లో విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ప్రాథమిక వైద్యం అని సబ్జెక్ట్ పెట్టి పూర్తిస్థాయిలో వారికి వైద్యంపై అవగాహన కలిగించాలని వైద్యశాఖ ఆలోచనగా తెలుస్తోంది. ఏదో కొద్ది రోజులు మొక్కుబడిగా కాకుండా… ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో వారానికి రెండు మూడు రోజులు ఒక పీరియడ్ ఇందుకు కేటాయించాలని భావిస్తుంది. కేవలం సీపీఆర్ మాత్రమే కాకుండా… అత్యవసర సమయాల్లో ఎలాంటి జబ్బులకు ఎలాంటి ఇమీడియట్ ట్రీట్మెంట్ ద్వారా ప్రాణాలు కాపాడుకునే విషయాన్ని చెప్పనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడితే ఎలాంటి సహాయం అందించాలి..? కాలు లేదా చేయు విరిగితే రక్తం పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఎవరికైనా వైద్య సహాయం అవసరమైతే ఎవరికి ఫోన్ చేయాలి ? ఇలాంటి పలు అంశాలపై పాఠాలుగా అందించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై కసరత్తును చేస్తోంది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage