యూత్ కాంగ్రెస్ నాయకుడు మోయిన్ కన్నుమూత
– చూసేందుకు వచ్చిన మామ కూడా మరణం
– పరామర్శించిన పార్టీ నేతలు, ప్రముఖులు
– కుటుంబానికి సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోయిన్ (35) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో మరణించిన మోయిన్ ను చూసేందుకు వచ్చిన మామ కూడా గుండెపోటుతో మరణించారు. ఈ సంఘటనలు వారి కుటుంబంలో విషాధం నింపాయి. తాండూరు పట్టణం బృందావన కాలనీకి చెందిన మోయిన్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. పట్టణంలోని గొల్లచెరువు ప్రాంతానికి చెందిన మున్నాబాయి కూతురుతో నివాహము జరిగింది. మోయిన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ మామ మున్నాబాయికి చెందిన ట్రాన్స్ పోర్ట్ పనులు చూసుకుంటు ఉండేవారు. మంగళవారం ఉదయం మోయిన్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసి మోయిన్ ను చూసేందుకు వచ్చిన మామ మున్నబాయి కూడ హర్ట్ అటాక్ కు గురై అపస్మారక స్థితికి వెళ్లారు. కొద్ది సేపటికి ఆయన కూడా మరణించారు. ఈ సంఘటనలు వారి కుటుంబంలో విషాధం నింపాయి. మరోవైపు మోయిన్ మరణవార్త తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులు కుటుంబాన్ని పరామర్శించారు. మోయిన్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.
సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
మరోవైపు మోయిన్ మరణించిన వార్త తెలిసిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మోయిస్ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంఘటన గురించి తెలుసుకుని కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…


