మైనార్టీలకు ఖుషీ కబర్..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మైనార్టీలకు ఖుషీ కబర్..!
– బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం
– ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలకు సర్కారు ఖుషీ కబర్ చెప్పింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న రూ. లక్ష సాయం మాదిరిగా పేద మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. బ్యాంకులతో సంబంధం లేకుండా మైనార్టీలకు రూ. 1లక్ష సాయం అందించనున్నారు. ఈ నిర్ణయంతో మైనార్టీలకు లబ్ధిచేకూరనుంచింది. ఈ విషయాన్ని కూడా ఇటీవల ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. విద్య, ఉపాధి సహా వివిధ రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతోందని సీఎం చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తుందని కేసీఆర్‌పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందించబోతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని మైనార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage