మానవత్వం చాటుకున్న ఆర్సీ గౌడ్

తాండూరు రాజకీయం వికారాబాద్

మానవత్వం చాటుకున్న ఆర్సీ గౌడ్
– మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
– కుటుంబానికి పరామర్శ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్(ఆర్సీ గౌడ్‌) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మండలంలోని మల్కాపూర్‌లో ఎవరైనా, ఏదైనా కారణంంతో మరణిస్తే బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా సోమవారం మల్కాపూర్ గ్రామానికి చెందిన మంటి చెట్యప్ప అనే వ్యక్తి అనారోగ్యంంతో కన్నుమూశారు. బీఆర్ఎస్ తాండూరు మండలం పార్టీ మైనర్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ ద్వారా విషయం తెలుకున్న బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్సీ గౌడ్ గ్రామానికి చేరుకున్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా చెట్యప్ప అంత్యక్రియల కోసం రూ. 4వేల ఆర్థిక సహాయం అందింంచారు. దీంతో కుటుంబ సబ్యులు ఆర్సీ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో- ఆప్షన్ సంఘం ఉపాధ్యక్షులు ఎండీ శంషోధిన్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ హసేన్ పటేల్, ఆర్సీ గౌడ్ యువసేన నాయకులు, యువకులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage