కేవీసీఎస్‌లో వినాయక సందడి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
కేవీసీఎస్‌లో వినాయక సందడి..!

– పర్యావరణ గణేషులను రెడి చేసిన విద్యార్థులు
– ప్రతిమలతో అబ్బుర పరిచిన విద్యార్థులు
– అభినందించిన ప్రిన్సపల్, యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌(కేవీసీస్)లో వినాయక చవతి సందడి నెలకొంది.

వినాయక చవితిని పురస్కరించుకుని స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో పర్యావణ గణనాధుల ప్రతిష్టాపన అనే థీమ్‌తో ఉత్సవాలు ఉత్సహాంగా జరుపుకున్నారు. పాఠశాలకు చెందిన టీచర్ మట్టి వినాయకుని తయారు విధానాన్ని వివరించగా విద్యార్థులు ఆమెను అనుసరిస్తూ మట్టి వినాయకులను తయారు చేశారు. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ విధానంలో కూడా విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు.

పేపర్లపై రంగులతో వినాయకుల బొమ్మలను గీసి ప్రదర్శించారు. దీంతో పాటు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు గణేషుని భక్తిగీతం, భక్తి ప్రసంగంతో మనోరంజింపజేశారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన మట్టి గణేషులు, పేపర్ గణేషులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వినాయక చవితి ఉత్సవాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ పర్యావరణ హిత గణనాథులను ప్రతిష్టించాలని స్పూర్తి నింపేందుకు వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు భక్తి భావాలతో పాటు సంస్కృతి సంప్రదాయాల విలువలు పెంపొందించేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్య కమిటి సభ్యులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్..!