ఆర్టీసీ ఉద్యోగులకు ఖుషీ కబర్..!
– డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులకు ఖుషీ కబర్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2.5 శాతం డీఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల రూ.3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగినా వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.

ఇదికూడా చదవండి…

