రేపు టెట్‌పై ఉచిత అవగాహన

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు టెట్‌పై ఉచిత అవగాహన
– ప్రగతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రగతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో రేపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సెంటర్ డైరెక్టర్ శ్రీశైలం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ప్రగతి కోచింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అవనిగడ్డ ఫ్యాకల్టీ ద్వారా సైకాలజీ, తెలుగు లెజెండ్ డా. నాగేశ్వర్ రావు, శ్రీశ్రీ లు హాజరవుతున్నారని వెల్లడించారు. టెట్ కు ఎలా సన్నద్ధం కావాలి, ఎలా మార్కులు సాధించాలని అంశాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9949272357, 7661982357 లకు సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!