భ‌యం లేకుండా టీకా వేసుకోవాలి

తాండూరు

భ‌యం లేకుండా టీకా వేసుకోవాలి
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : భ‌యం లేకుండా అర్హులైన వారంద‌రు వ్యాక్సీనేష‌న్ వేసుకోవాల‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. ఆదివారం వార్డులో కొన‌సాగుతున్న ఇంటింటికి వ్యాక్సీనేష‌న్‌లో ఆమె త‌న మొద‌టి డోస్ టీకాను వేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ క‌రోనా మ‌హామ్మారి అంత‌మైపోవాలంటే 18 ఏండ్లు నిండిన వారంతా టీకా వేసుకోవాల‌న్నారు. టీకాపై ఎలాంటి అపోహ‌లు పెట్టుకోకుండా.. భ‌యం లేకుండా వేసుకోవాల‌ని భ‌రోసా క‌ల్పించారు. ఇంటింటికి అందిస్తున్న ఉచిత వ్యాక్సీనేష‌న్‌ను అంద‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో అంగ‌న్ వాడీ టీచ‌ర్లు, వైద్య సిబ్బంది, ఆశా వ‌ర్క‌ర్లు త‌దిత‌రులు ఉన్నారు.