రూ. కోటి విలువైన బంగారం పట్టివేత

క్రైం తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

రూ. కోటి విలువైన బంగారం పట్టివేత
– శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాదీనం
– నిందితులపై కేసు నమోదు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : లోపల దుస్తుల్లో దాచుకుని వచ్చిన బంగారాన్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు కోటి రూపాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తున్న క్రమంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో ఓ ప్రయాణికులిద్దరిపై అనుమానం రావడంతో వారిని సోదా చేశారు. వారి లోదుస్తుల్లో బంగారాన్ని దాచుకుని అక్రమంగా తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి రూ. 49.47 లక్షలు విలువైన 810 గ్రాముల బంగారం, మరో ప్రయాణికుడి నుంచి రూ.43.79 లక్షలు విలువ చేసే 717 గ్రాముల బంగారాన్ని సీజ్‌ చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులిద్దరూ గతంలోనూ తరచూ గల్ఫ్‌ దేశాలకు రాకపోకలు సాగించినట్లు కస్టమ్స్‌ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!