రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్
– హైదరాబాద్ – వాడీకి ప్రత్యేక రైళ్లు
– తాండూరు మీదుగా అన్‌ రిజర్వుడ్‌ రైళ్ల సర్వీసు
– ఏయే రోజుల్లో నడుస్తాయంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్ – వాడీ రైల్వే ప్రయాణికులకు దక్షణ మద్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షణ మద్య రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి.. పూర్తిగా అన్ రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్స్. వికారాబాద్, తాండూరు మీదుగా ఈ రైళ్ల సర్వీసు కొనసాగనుంది. హైదరాబాద్ – వాడి మార్గంలో సర్వీసులను అందిస్తోంది. ఈ నెల 29, వచ్చే నెల 1వ తేదిలలో ఇవి పట్టాలెక్కనున్నాయి. బేగంపేట, సనత్‌నగర్, హఫీజ్‌పేట, లింగంపల్లి, నాగులపల్లి, శంకరపల్లి, గుల్లగూడ, వికారాబాద్, గొడంగూరు, ధరూర్, రుక్మాపూర్, తాండూరు, మంతట్టి, నవాంద్గి, కుర్కుంట, సేడం, మల్ఖేడ్ రోడ్, చిత్తాపూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

మొత్తం 22 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ల ఉంటాయని వెల్లడించింది. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కింద ప్రయాణీకులు నేరుగా టికెట్లు పొంది ఈ రైళ్లలో ప్రయాణించవచ్చు. ఈ నెల 29న సోమవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07175 అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైలు అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు వాడికి చేరకుంటుంది. వాడి నుంచి అదే రోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరే నంబర్ 07176 ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

అదేవిదంగా జులై 1వ తేదీన బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు హైదరాబాద నుంచి బయలుదేరే నంబర్ 07175 ప్రత్యేక రైలు అదే రోజు ఉదయం 10 గంటలకు వాడికి చేరుకుంటుంది. అదే రోజు ఉదయం 11:40 నిమిషాలకు వాడి నుంచి బయలుదేరే నంబర్ 97176 ప్రత్యేక రైలు సాయంత్రం 4: 35 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షణ మద్య రైల్వే శాఖ సూచించింది.

కాలనీలపై కనువిప్పు కలిగెదెప్పుడు..?