ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి
– ఫిర్యాదుదారునికి అండగా ప్రజా సంఘాలు
– న్యాయంచేయాలని డీఎస్పీకి వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై అనుచితంగా వ్యవహరించిన ఎస్ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తాండూరుకు చెందిన పీడీఎస్‌యూ జిల్లా నాయకులు, ఉద్యమ కారుడు శ్రీనివాస్ గురువారం రాత్రి ఓ కేసు విషయంలో తాండూరు పట్టణ పోలీస్టేషన్‌కు వెళ్లగా కానిస్టేబుల్‌తో పాటు ఉన్నత ఉద్యోగి అయిన ఎస్ఐలు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను శుక్రవారం తాండూరు ప్రజా సంఘాల నాయకులు ఖండించారు.
డీఎస్పీ కార్యాలయంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి ఫిర్యాదు దారుడు శ్రీనివాస్‌కు న్యాయంచేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు సోమశేఖర్, విజయలక్ష్మీ పండిత్, శ్రీనివాస్, శ్రీనివాస్, పర్యాద రామకృష్ణ, శ్రావణ్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ పీడీఎస్‌యూ నాయకులు శ్రీనివాస్‌పై పోలీసుల వ్యవహరించిన తీరును ఖండించారు. నాయకులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇలాంటి పరిణామాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతారణాన్ని దెబ్బతీస్తాయని, ప్రజలకు పోలీసులపై గౌరవం తగ్గిపోతుందని అన్నారు. శ్రీనివాస్ విషయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపి దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సత్తార్, దానిని ప్రోత్సహించిన ఎస్ఐ కాశినాథ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు, దీపక్‌రెడ్డి, బుగ్గప్ప, మహిపాల్, అబ్బని బసయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

