గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన కోట్రిక విజయలక్ష్మీ
-శిశుమందిర్ పాఠశాలలో మొక్కలు నాటిన మాజీ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ నేత, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ స్వీకరించారు. ఇటీవల ప్రగతి భవన్ లో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా కోట్రిక విజయలక్ష్మీ సన్మానం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కల పెంపకం చేపట్టి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాలని కోట్రిక విజయలక్ష్మీతో సూచించారు. ఈ మేరకు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.
పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి 7 మొక్కలను నాటారు. అనంతరం కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు అందరు పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. విద్యార్థులు పర్యావరణ ప్రేమికులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, సోషల్ వర్కర్ కేవీఎం వెంకట్, పాఠశాల నిర్వహణ కమిటి సభ్యులు మల్లేశం, అనంత్ రెడ్డి, ప్రధానాచార్యులు విజయలక్ష్మి, కోటం సిద్ధలింగం, బస్వరాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

