మార్కెట్ కమిటి పాలకవర్గం ఖరారు..!
– చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ నేత సతీమణికి చాన్స్
– ఈ నెలాఖరులోనే పాలకవర్గం ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటికి కొత్త పాలకవర్గం దాదాపు ఖరారు అయ్యింది. ఈ నెలాఖరులోగా కొలువుదీరేందుకు అవకాశం ఉంది. తాండూరుకు చెందిన బీఆర్ఎస్ నేత సతీమణికి మార్కెట్ కమిటి చైర్ పర్సన్‌గా చాన్స్ ఇవ్వనున్నారు. గతేడాది అక్టోబర్ 23తో పాలకవర్గం గడువు ముగిసినప్పటికీ అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. కొత్తగా పాలకవర్గం ఏర్పాటులో చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత శ్రీనివాస్ చారీ సతీమణీ వీణా పేరు తెరపైకి వచ్చాక తర్వాత కౌన్సిలర్ విజయాదేవికి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కాని అధిసాధ్యం కాలేదు. దీంతో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వీణా శ్రీనివాసాచారి, వైస్‌చైర్మన్‌గా ఉమాశంకర్ పేర్లు నామినేటెడ్ చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, డైరెక్టర్‌ల నామినేటెడ్‌కు సంబంధించి పార్టీ ముఖ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరకు వీణ శ్రీనివాసాచారికే పదవి కట్టబెట్టనున్నారు. కొత్త పాలకవర్గం రెండేళ్లు కొనసాగే విధంగా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ నెలలో పాలకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లతో పాటు డైరెక్టర్ల పేర్లను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి…

