ప్రమాణ స్వీకారోత్సవానికి రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రమాణ స్వీకారోత్సవానికి రండి..!
– మంత్రి, ఎంపీలను కలిసిన గ్రేన్‌, సీడ్స్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలను అసోసియేషన్ సభ్యులు కోరారు. తాండూరులోని గ్రేన్‌ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇటీవలే ఏర్పాటైన సంగతి తెలిసిందే. త్వరలో అసోసియేషన్ ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలను హైదరాబాద్ లో కలిశారు. అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రావాలని కోరారు. అంతకుముందు అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంత్రి, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, కార్యదర్శి పటేల్ కిరణ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పటేల్ రాంరెడ్డి, సభ్యులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!