ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హిళ నాయ‌కులు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హిళ నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్ర ర‌వాణా శాఖ మాజీ మంత్రి, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డికి తాండూరు టీఆర్ఎస్ మ‌హిళ‌ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. గురువారం హైద‌రాబాద్‌లో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రిగాయి. తాండూరు మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్ బొబ్బిలి శోభారాణి, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల నీర‌జాబాల్‌రెడ్డి, మాజీ కౌన్సిల‌ర్ గ‌డ్డ‌లి ప‌రిమ‌ళ ర‌వీంద‌ర్‌, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ మ‌హిళ అధ్య‌క్షురాలు అనురాధ‌, నాయ‌కురాలు నర్మ‌దాదేవి, చంద్ర‌క‌ళ త‌దిత‌రులు
ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డికి పుష్ప‌గుచ్చం అందించారు. అనంత‌రం ఎమ్మెల్సీ చేత కేక్ క‌ట్ చేంయించి తినిపించారు. ఇలాంటి జ‌న్మ‌దిన వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ మాజీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, బొబ్బిలి సంజీవ‌రావు, సాయిపూర్ బాల్‌రెడ్డి, మ‌సూద్, బంటు మ‌ల్ల‌ప్ప‌, ద‌ర్మీది ర‌వింద‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.