స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో ఎమ్మెల్సీ దంపతుల భేటీ

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో ఎమ్మెల్సీ దంపతుల భేటీ
– నివాసంలో కలిసిన మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి
– సన్మానించి, జిల్లా అభివృద్శిపై చర్చ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని స్పీకర్ నివాసంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేంధర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా శాలువతో సన్మానించి పూల మొక్కను అందించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై స్పీకర్ గారితో చర్చించారు. స్పీకర్‌తో ఎమ్మెల్సీ దంపతుల భేటీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!