తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
– వికారాబాద్ జిల్లా తాండూరు వాసిగా అనుమానం
– జేబులో లభించిన తాండూరు ఆర్టీసీ బస్ టిక్కెట్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. అయితే మృతుడు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి రేణిగుంట అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో సుమారు 30 ఏండ్లకు పైగా ఉన్న వ్యక్తి విగతజీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాల కోసం తనిఖీ చేయగా అతని జేబులో నుంచి తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన బస్ టిక్కెట్ లభించింది. టిక్కెట్ పై తాండూరు లక్ష్మీనారాయణపూర్ అని ఉంది. మిగతా వివరాలు లభిచంలేదు. దీంతో అక్కడి పోలీసులు తాండూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. కరణ్ కోట్ పోలీసులు మృతుని ఫోటోలను విడుదల చేశారు. మృతుని వివరాలు తెలిస్తే కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి(సెల్:9985851817)కు సంప్రదించాలని ప్రకటించారు.
ఇది కూడా చదవండి…

