చిరు ధాన్యాలతో పోషకాలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

చిరు ధాన్యాలతో పోషకాలు
– ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలి
– ఐడీసీఎస్ సూపర్ వైజర్ సుశీల
– ఇందిరానగర్ లో పోషకాహార వారోత్సవం
తాండూరు,దర్శిని ప్రతినిధి : చిరు ధాన్యాలతో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయని ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుశీల అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరా నగర్ సెక్టార్ లోని 1వ సెంటర్ లో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుశీల మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. చిరు ధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయన్నారు. కావున గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.

బాలింతలు తమ శిశువులకు ఆరు నెలల పాటు తల్లిపాలనే ఇవ్వాలన్నారు. అప్పుడే శిశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతారని అన్నారు. దీంతో పాటు వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బోయరవి, అంగన్ వాడి టీచర్లు, ఆయాలు, ఆరోగ్య సిబ్బంది, గర్భిణి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

భద్రేశ్వరుని సేవలో తాండూరు సబ్ కలెక్టర్..!