స్కూల్ టైంలో భారీ వాహనాలను నియంత్రించండి
– పోలీసులకు అఫ్పూ(నయూం) విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో పట్టణంలోని భారీ వాహనాలు రాకుండా నిషేధించాలని టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) కోరారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పాఠశాలల సమయాల్లో భారీ వాహనాల రాకపోకలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పట్టణంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు అఫ్పూ దృష్టికి తీసుకవచ్చారు. దీంతో అఫ్పూ ఈ సమస్యను ఫోన్‌లో పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. పట్టణంలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించాలని కోరారు.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు సీఐ రాజేందర్‌రెడ్డి స్పందించి ఉదయం 8 గంటల నుంచి 9-30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు వాహనాలు పట్టణంలోకి రాకుండా ఆంక్షలు విధిస్తామని హామి ఇచ్చినట్లు అఫ్పూ తెలిపారు. సమస్యను వివరించిన వెంటనే స్పందించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, యజమాన్యాల తరుపున సీఐకి, పోలీసులకు అఫ్పూ ధన్యవాదాలు తెలిపారు.
