గణేష్ లడ్డూకు భారీ డిమాండ్..!
– రూ. 3లక్షలకు దక్కించుకున్న దంపతులు
– గత యేడాది రికార్డు బ్రేక్ చేసిన మంచాల ఫ్యామిలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో గణేష్ లడ్డూ వేలంకు భారీ డిమాండ్ లభించింది. శుక్రవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన వినాయక లడ్డూ వేలంలో భక్తులు పాల్గొని సొంతం చేసుకున్నారు. గత యేడాది వేలం ధరను బద్దలు కొట్టారు. అయితే గత యేడాది అత్యధిక ధరతో దక్కించుకున్న దంపతులే ఈ సారి కూడా అత్యధిక ధర పాడి లడ్డూను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని సీతారాం పేట్ పటేల్ గార్డెన్‌లో వినాయకున్ని ప్రతిష్టించారు. గణేషుని చేతిలో ఐదు రోజులు పూజలందుకున్న లడ్డూను వినాయక నిమజ్జనం సందర్భంగా వేలం నిర్వహించారు. ఈ వేలంలో మంచాల భానురేఖ, అశోక్ కుమార్ దంపతులు రూ. 3లక్షల 3వేల 333లకు లడ్డూను దక్కించుకున్నారు. అయితే గత యేడాది కూడా తాండూరులో రికార్డు సృష్టించిన గణేష్ లడ్డూ వేళాన్ని ఈ యేడాది కూడా ఆ దంపతులకే బ్రేక్ చేయడం విశేషం.

ఇదికూడా చదవండి…

