ఉర్దూఘర్ చైర్మన్ రజాక్‌ను సన్మానించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఉర్దూఘర్ చైర్మన్ రజాక్‌ను టీఆర్ఎస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఉర్దూఘర్ చైర్మన్‌గా రజాక్ నియామకం కావడం పట్ల శనివారం టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు జిలాని ఆయనను, డైరెక్టర్లను సన్మానించారు. అదేవిధంగా
టీఆర్ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, న్యాయవాది గోపాల్‌ను కూడ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్ధూఘర్ డైరెక్టర్లు అన్వర్ ఖాన్, అస్లాం, ఇబ్రహీం, రహమాన్, రజియా భేగంలతో పాటు టీఆర్ఎస్ యువనాయకులు అబ్దుల్ సమద్, ఇంతియాజ్, రవీందర్, మోయిజ్ తదితరులు ఉన్నారు.
