స్పెషల్ అట్రాక్షన్‌గా బస్సుయాత్ర..!
– తాండూరులో మళ్లీ చేరికల పర్వం
– ఈ సారి ముఖ్యలు నేతలంటూ ప్రచారం
– బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే..!
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత బస్సు యాత్రపై అందరి దృష్టి పడింది. తాండూరు నుంచే ప్రారంభిస్తున్న యాత్ర స్థానిక రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాండూరు పట్టణంలోని చేపట్టే షెడ్యూల్ ను కూడా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖరారు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో నిర్వహించే రోడ్ షోలో టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రాహ్మోహన్ రెడ్డితో పాటు ముఖ్యనేతలు పాల్గొంటున్నారు.
ఈ సంగతి అందరికి తెలిసిందే అయినా ఈ బస్సులో కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయంటూ నేతలు హింట్లు ఇస్తున్నారు. తాండూరులో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో చేరికల పర్వం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాండూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్, ఇతర పార్టీల ముఖ్య నేతలు హస్తం గూటికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్ బస్సుయాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగుతాయా లేదా అనేది అసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ఖరారు కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పుల్ జోష్‌లో ఉన్నారు.
ఇది కూడా చదవండి…

