బయటోళ్ల చిచ్చు..!
– బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రగడ
– గాంధీనగర్ పోలింగ్ వద్ద ఉద్రిక్తత
– చెదరగొట్టిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలింగ్ కేంద్రం వద్దకు బయటోళ్లు వచ్చారని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య రగడ చోటు చేసుకుంది. నువ్వెంత అంటే నువ్వేంత అంటూ నేతలు బాహాబాహీకి దిగారు. ఈ సంఘటన తాండూరు పట్టణం గాంధీనగర్ లో చోటు చేసుకుంది. గురువారం తాండూరు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలింగ్ సాఫీగా సాగింది. పోలింగ్ కేంద్రానికి బయట వాళ్లు వచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ వాళ్లు కూడా అక్కడి చేరుకున్నారు. ఈ విషయంలో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ మద్య కాంగ్రెస్ పార్టీ మహిళ అధికార ప్రతినిధి కల్వ సుజాత మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మసూద్ తదితరులు అక్కడి చేరుకోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ వారిని చెదర గొట్టే. ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో పోలీసులు మీడియాను దౌర్జన్యంగా తప్పించే ప్రయత్నం చేశారు.
మొత్తానికి బయట వాళ్లు పోలింగ్ కేంద్రానికి వచ్చారని ఆరోపిస్తూ. ఇరు వర్గాల వాగ్వివాదాలు చేసుకోవడంతో పెద్ద రగడ చోటు చేసుకుంది. చివరకు ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి…

