అయ్యో వడ్డె లక్ష్మీ..!

క్రైం టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

అయ్యో వడ్డె లక్ష్మీ..!
– తనకన్నా ముందే తన ఓటు వినియోగం
– దొంగ ఓటు వేశారని ఆవేధన
– చాలెంజ్ ఓటుకు డిమాండ్ చేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జరిగిన అసెంబ్లి ఎన్నికల పోలింగ్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన వేయకన్న ముందే తన ఓటును మరొకరు వేశారని తెలిసి ఓ మహిళ ఓటరు ఆశ్చర్యానికి గురైంది. తాండూరు పట్టణంలో జరిగిన సంఘటనపై మరిన్ని వివరాల్లోకి వెళితే.. గురువారం తాండూరు పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. పట్టణంలోని సాయిపూర్ కు చెందిన వడ్డె లక్ష్మీ అనే మహిళకు అదే ప్రాంతంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు ఉంది. ఈ మేరకు తన హక్కును వినియోగించుకునేందుకు ఆమె పోలింగ్ స్టేషన్కు వెళ్లింది. గుర్తింపు కార్డును చూసిన అధికారులు అప్పటికే ఆమె ఓటును వెరొకరు వేసినట్లు గుర్తించారు.

దీంతో వడ్డె లక్ష్మీ నిర్ఘాంతపోయింది. జరిగిన విషయాన్ని వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ వైస్ చైర్ పర్సన్ రత్నామాల నర్సింలు, కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. వెంటనే దొంగ విషయంపై స్థానిక ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావుకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ, అధికారులు జరిగిన సంఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. అంతేకాకుండా ఓటుకు దూరమైన వడ్డె లక్ష్మీకి చాలెంజ్ ఓటుకు అవకాశం కల్పిస్తామన్నారు. మరోవైపు దొంగ ఓటు సంఘటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. విచారణ జరిపి దొంగ ఓటుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వడ్డె లక్ష్మీకి చాలెంజ్ ఓటు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!