చలి బెల్లం.. ఔషదమే..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

చలి బెల్లం.. ఔషదమే..!
– సీజన్‌లో తీసుకోవడంలో లాభాలు
– గుండె ఆరోగ్యానికి బెట్టర్ కేర్
దర్శిని డెస్క్ : ఎండాకాలం, వానాకాలం, చలికాలం ప్రతి కాలాల్లో ఆరోగ్యంపై ఎంతో శ్రద్ద అవసరం. ఆయా సీజన్లలో ఉపయోగపడే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ చలికాలంలో బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఉండే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. అందుకే అనేక మంది పంచదారకు బదులు బెల్లంను స్వీట్లలో ఉపయోగిస్తారు. చలికాలంలో బెల్లం తినడం ఔషధం లాంటిది. మన శరీరానికి అవసరమైన మూలకాలు బెల్లంలో లభిస్తాయి. విటమిన్ ఎ, బి, సుక్రోజ్, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. చలికాలంలో బెల్లం శరీరానికి పవర్ బూస్టర్‌గా పనిచేస్తుంది. అందుకే చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తున్నాం.

స్పాట్ ఎనర్జీ
నేటి ఆదునిక జీవనశైలిలో అందరు ఉరుకులు పరుగులు పెడుతూ ప్రయాణం చేస్తున్నారు. దీంతో త్వరగా అలసటగా నీరుత్సహపడారు. ప్రస్తుత చలికాలంలో బెల్లం తీసుకోవడం వల్ల క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి శక్తి లభిస్తుంది. బెల్లంలో లభించే పోషకాల కారణంగా, శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా పంచదారకు బదులు బెల్లం తినే వారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇమ్యూనిటీ పవర్ పెంపు
శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందిచే ఆహారాలు తినాలి. లేదంటే జలుబు, దగ్గు, జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అదేవిధంగా, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, త్వరగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఒక బెల్లం ముక్కను తినడం అలవాటు చేసుకోండి.

గుండె ఆరోగ్యం కోసం
బెల్లంలో ఉండే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం కారణంగా బెల్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చలికాలంలో చాలా మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు బెల్లం తింటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది
బెల్లంలో ఉండే యాంటీకోగ్యులెంట్ గుణాలు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. శరీరంలోని అన్ని భాగాల నుంచి రక్తం సిరల ద్వారా సాఫీగా ప్రవహిస్తుంది. ఇది మొత్తం శరీరానికి చాలా మేలు చేస్తుంది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!