హద్దుదాటితే పరిణామాలు వేరే..!
– రోహిత్ రెడ్డిని విమర్శిస్తే ఖబడ్డార్
– వార్డు మెంబర్, కౌన్సిలర్ గా గెలువ్
– మురళీగౌడ్ కు రాజుగౌడ్ సవాల్
– బీఆర్ఎస్ బీ బ్యాచ్ కాంగ్రెస్ కు చీడ
– కాంగ్రెస్ నేతల వాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విషయంలో అదే పనిగా హద్దుదాటితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రోహిత్ రెడ్డి, అతని ఫ్యామిలీపై దుష్ప్రచారాలు చేస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తదితరులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రోహిత్ రెడ్డిపై చేసిన విమర్శలను ఖండించారు.

తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సాధించిన రూ. 1600 కోట్ల నిధులలో నుంచి నిర్మాణంలో పనులను పూర్తి చేయాలని ఎంతో హుందాగా కోరడం జరిగిందన్నారు. ఆయన వాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తూ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పదే పదే రాద్ధాంతాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దౌర్జన్యాలు, గుండాయిజాలు చేశారని విమర్శించే నేతలు నిజంగా చేసి ఉంటే స్వేచ్ఛగా ఉండేవారా అని అన్నారు. ఎమ్మెల్యేగా సాధించిన నిధులలో గ్రామానికి రూ. 50 లక్షలు, మున్సిపల్ వార్డులకు రూ. 1కోటి చొప్పున మంజూరు చేయించారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా తాండూరు ప్రజలకు ఇచ్చిన హామి కోసమే రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నుంచి సాధించిన నిధులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయనే ఉద్దేశంతో రోహిత్ రెడ్డి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామన్న నేతలు గతంలో అభ్యర్థుల ఓటమికి కారుకులమని ఎందుకు చెప్పలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోని కొందరు బీ బ్యాచ్ నేతలు కాంగ్రెస్ లో చేరడం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కలిసొచ్చిందన్నారు. అంతేకాని వాళ్లు పెద్దగా చేసిందేమి లేదని. కొన్ని దుష్టశక్తులు కాంగ్రెస్ పార్టీ చీడలా పట్టుకున్నాయని అన్నారు. పార్టీలో ఉన్న మురళీ గౌడ్ ఎమ్మెల్యేను మిస్టర్ అంటూ సంబోదించడం సరైంది కాదన్నారు. రోహిత్ రెడ్డి సహాకారంతో గ్రంథాలయ సంస్థ పదవిని పొంది, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనకు నిజంగా ప్రజాబలం ఉంటే ఊళ్లో గాని, తాండూరు మున్సిపల్ లో గాని వార్డు మెంబర్ లేదా కౌన్సిలర్ గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ సవాల్ చేశారు. లేని పోని విధంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై విమర్శలు చేస్తే.. హద్దులు దాటితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆరు :’ గ్యారెంటీల అమలుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే ప్రజలే వెంబడించి తరిమేస్తారని. అప్పుడు ప్రజల వెంట ఉండి. అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఫ్లోర్ లీడర్ శోభారాణి. పట్టణ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి. మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

