జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా ఉమా శంకర్ ప్రసాద్
– ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను నారాయణ పేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

అదేవిధంగా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌ను కూడా బదిలీ చేశారు. ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు సబ్ కలెక్టర్, నారాయణపేట్ ఇంచార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా సబ్ కలెక్టర్‌ను తిరిగి వికారాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


