సావిత్రి బాయి పూలే సేవలు చిరస్మరణీయం
– బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
– తాండూరులో మహిళ ఉపాధ్యాయులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని ప్రాథమిక పాఠశాలలో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి శుభప్రద్ పటేల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలోని మహిళ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ దేశంలోని మహిళ ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, విద్యావేత్త సావిత్రి బాయి పూలే సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. ఆమె ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, ఉపాధ్యాయురాలు సంధ్యారాణి, విద్యారాణి, మంజుశ్రీ గంగా, నాయకులు పర్యాద రామకృష్ణ, వీరేశం, శుభప్రద్ పటేల్ ట్రస్ట్ సభ్యులు శ్రీశైలం, చావుస్, హరీష్, నరేష్ గౌడ్, భాను ప్రసాద్, చందు పటేల్, ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

