వైభవంగా ఏరువాక పౌర్ణమి
– బసవన్నలను ఊరేగించిన రైతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నదాతకు, రైతు సోదరులకు అత్యంత ప్రియమైన పండుగ ఏరువాక పౌర్ణమిని మంగళవారం తాండూరు పట్టణం, తాండూరు మండలంలో వైభవంగా జరుపుకున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు, సాయిపూర్ మల్ రెడ్డిపల్లిలకు చెందిన రైతులు సాయంత్రం బసవన్నలను ఊరేగించారు.. ఉదయం నుంచి బసవన్నలను కాలియందియలతో, మెడలో కొత్త గంటలతో, కొమ్ములకు కొత్త అందాలను తీర్చి దిద్ది ఊరంతా ఊరేగించి రైతులు ఏరువాక పౌర్ణమిని ఉత్స హాంగా జరుపుకున్నారు. సాయిపూర్లో సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు కన్నుల పండుగలా జరిగింది. ఎడ్లబండ్ల ఊరేగింపుతో కాలనీ సమీపంలోని సవరమ్మ, రక్తమైసమ్మ ఆలయాల చుట్టు ప్రదక్షనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని పాత తాండూరుతో పాటు మల్ రెడ్డిపల్లిలో, చుట్టు పక్కలా గ్రామాల్లో ఏరువాక పౌర్ణమిని అన్నదాతలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్‌రెడ్డి, బంటు మల్లప్ప, సాయిపూర్ రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు మండలంలో…..
తాండూరు మండలంలో రైతులు ఏరువాక పౌర్ణమిని వైభవంగా జరుపుకున్నారు. మంగళవారం తాండూరు మండలంలోని అంతారం, చెంగోల్, జినుగుర్తి, మల్కాపూర్ ఐనెల్లి తదితర గ్రామాల్లో ఏరువాక సందర్భంగా రైతులు ఎద్దులను ఊరేగించారు.

ఎద్దులకు పూజలు నిర్వహించి పండగను ఉత్సహాంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో చెంగోల్‌లో టీఆర్ఎస్ నాయకులు వేణుగౌడ్, వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు రాము. నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, యాదగిరి, విజయ్, అనిల్, ఎల్లప్ప, సంఘప్ప, మల్లప్ప, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.

