మున్సిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
– చలో హైదరాబాద్‌కు తరలిన కాంట్రాక్టు కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని తాండూరు మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల యూనియన్ జేఏసీ పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద చేపట్టిన చలో హైదరాబాద్ సమ్మెకు తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు భారీగా తరలివెళ్లారు. సమ్మెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గోరెప్ప, గోపాల్ తదితరులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు పెంచిన వేతనాలు చెల్లించాలని, అమలు చేయాలని కోరారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఇతర సమస్యలు కూడ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు జయప్రకాష్, చిన్నా(శశి), కార్మికులు అశోక్, సిహెచ్ అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
