ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు తాండూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి పట్టణంలోని పలు వీధుల్లో మహిళలు బతుకమ్మను తీరొక్కపూలో పేర్చి పూజలు నిర్వహించారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. పట్టణంలోని వాల్మీకీనగర్, సాయిపూర్ తదితర ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ పండగను నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని ఆడపడుచులలంతా బతుకమ్మ ఆట పాటలతో ఉత్సహాంగా గడిపారు. ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలతో సందడి వాతావరణం నెలకొంది.
