జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.మల్లికార్జున స్వామి బదిలి
– మెదక్ జిల్లా ఆసుపత్రికి ట్రాన్సఫర్ చేస్తూ ఉత్తర్వులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి బదిలీ అయ్యారు. గురువారం మెదక్ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో కూడ ఓ సారి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామిని బదిలీ చేయగా కొన్ని నెలల తరువాత తిరిగి ఆయన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా మళ్లీ డాక్టర్ మల్లికార్జున స్వామి జిల్లా ఆసుపత్రి నుంచి బదిలీ అవుతున్నారు. అయితే ఈ బదిలీ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆసుపత్రి సూపరిండెంట్‌గా డాక్టర్ మల్లికార్జున స్వామి జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సేవలందించేందుకు కృషి చేశారు. మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించాలని తీవ్రంగా శ్రమించారు. అది నెరవేరకుండానే బదిలీ అయ్యారు. మరోవైపు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ స్థానంలో డాక్టర్ శెట్టి రవిశంకర్‌ను ఇంచార్జ్ సూపరిండెంట్‌గా నియమించినట్లు సమాచారం.
