తాండూరు పురోహితుడికి జ్యోతిష్య శిరోమణి అవార్డు

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు పురోహితుడికి జ్యోతిష్య శిరోమణి అవార్డు
– హైదరాబాద్ ఎన్టీఆర్ కళాభవన్‌ లో అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన పురోహితుడు జ్యోతిష్య శిరోమణి అవార్డుకు ఎంపికయ్యారు. పట్టణంలోని వడ్డెర గల్లి చెందిన మహేష్ కుమార్ శాస్త్రీ మంచి పురోహితుడుగా గుర్తింపు ఉంది. జ్యోతిష్యంలో కూడా మంచి ప్రావిణ్యం కూడా ఉంది. ఆదివారం హైదరాబాద్‌ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళాభవన్‌ లో ఎన్‌స్లివ్ ఆస్ట్రో ద్వారా మహేష్‌ కుమార్ శాస్త్రికి జ్యోతిష్య శిరోమణి అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న మహేష్‌ కుమార్ శాస్త్రి సంతోసం వ్యక్తం చేశారు. జ్యోతిష్య శిరోమణి అవార్డు ఎంపిక చేస్తున్న పెద్దలందరికీ, గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!