సాహో.. సంపత్‌ సార్..!

ఆరోగ్యం రాజకీయం వికారాబాద్

సాహో.. సంపత్‌ సార్..!
– అర్దరాత్రి గర్భిణీకి రక్తదానం
– ఆదుకున్న వైద్యుడికి అభినందనల వెల్లువ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులో డాక్టర్ సంపత్‌ సార్ అంటే తెలియని వారు చాలా తక్కువ. వైద్యంతో పాటు బీవీజీ ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది పేదలకు సేవలందిస్తున్నారు. పెళ్లిళ్లు.. అంత్యక్రియలు అనే తేడా లేకుండా సాయం అందిస్తున్నారు. ఇంత చేస్తున్న కూడా డా.సంపత్ సార్‌లో మరో కోణం కూడా ఉంది. అదే అత్యవసర సమాయాల్లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా 153 సార్లు రక్తదానం చేశారు. తాజాగా ఈ సంఖ్య 154కు చేరింది. ఎలా అంటే ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీకి రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి తాండూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని వెంటనే రక్తం ఎక్కించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు, తెలిసిన వారు వాట్సాప్, సామాజిక వేధికలో గర్భిణీకి అత్యవసరంగా ‘ఓ నెగటివ్’ బ్లడ్ గ్రూపు రక్తమెక్కించాల్సిన అవసరం వచ్చిందనే సందేశాలు వైరల్ అయ్యాయి. ఈ మెసేజ్ చూసిన డాక్టర్ సంపత్ సార్ వెంటనే ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేశారు.

ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తారనే మానవతా దృక్పథాన్ని సంపత్ మరోసారి నిరూపించుకుని సాహో అనిపించుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి సంపత్‌ సార్‌కు అభినందనలు వెలువెత్తాయి.

ఇదికూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!