భూకైలాస్‌లో శనీశ్వర పూజలు
– ఆలయంలో పూజలకు ఏర్పాట్లు
– పాల్గొనేందుకు భక్తులకు అవకాశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో ఎల్లుండి శనివారం శనీశ్వర పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. శనివారం శనిత్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతక రిత్య, శని మహర్ధశ, అంతర్దశ ఉన్న వారితో పాటు శనీశ్వర దోషాలు ఉన్న భక్తులు ఉదయం 5-45 నిమిషాలకు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించాలన్నారు. పూజలో పాల్గొనే భక్తులు వక్కలు-5 ఖర్జూర పండ్లు-5, నువ్వుల నూనే-1, నల్ల నువ్వు-100 గ్రాములు, నల్ల ద్రాక్ష-1/2, తమలపాకులు-11, నల్ల జిల్లేడుపూలు లేదా ఆకులు, టెంకాయలు-2, నలుపు జాకెట్-1 లేదా నల్లదారం తీసుకరావాలన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9010800769కు సంప్రదించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

