అయ్యో.. దేవుడా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అయ్యో.. దేవుడా..!
– విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
– 26 రోజుల క్రితం తాండూరులో ఘటన
– పేద కుటుంబంలో తీరని విషాధం
– పట్టణ పోలీస్టేషన్ లో కేసు నమోదు
– భరోసా, న్యాయం కోసం ఎదురు చూపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదరికంలో ఉన్నా.. ఉన్నతంలో సంపోతంగా జీవిస్తున్న కుటుంబంపై విధి విద్యుత్ షాక్ రూపంలో కుటుంబ పెద్దను బలితీసుకుంది. ఈ సంఘటన సుమారు 26 రోజుల క్రితం జరిగింది. విద్యుత్ షాక్ వల్ల వ్యక్తి మరణించడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి తీరని విషాధం నిండుకుంది. మృతుని భార్య, ఇద్దరు ఆడపిల్లలు జీవనం ఆగమాగం అయ్యింది. ఆర్థిక భరోసా, న్యాయం కోసం ఎదురు చూస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు అంబేద్కర్ నగర్ హరిజన్ వాడకు చెందిన జుంటుపల్లి శంకర్(50) కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే వాడు. భార్య జుంటుపల్లి మంజుల ప్రవేటు టీచర్ గా పనిస్తోంది. హరిప్రియ, యామిని అనే ఇద్దరు ఆడ కూతుళ్లు ఉన్నారు. కుటుంబానికి శంకర్ పెద్ద దిక్కు. అయితే గతనెల మే 14న ఉదయం 11-30 గంటల ప్రాంతంలో ఇంటి ముందు వైరుపై ఆరబెట్టి ఉన్న బట్టలను తీసుకునేందుకు బయటకు వచ్చాడు. ఈ వైరుకు పక్కనే మున్సిపాల్టీ వీధి దీపాలు ఆన్.. ఆఫ్.. చేసే ఎంసీబీ వైరుకు కూడా ఉంది. శంకర్ బట్టలు తీసే క్రమంలో వైరు ఎంసీబీ వైరుకు తగిలి విద్యుత్ షాక్ కు గురై కింద పడిపోయాడు. గమనించిన కుటుంభీకులు, సమీపంలో ఉన్న జెట్టిపాగ జగదీష్, ముత్యప్ప, జెట్టిపాగ నరేష్ లు కర్రలతో శంకర్ ను వైరు నుంచి దూరం చేశారు. వెంటనే చికిత్స నిమిత్తం తాండూరు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే విద్యుత్ షాక్ తో శంకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు మేరకు పట్టన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పేదరికంలో ఉన్న కుటుంబంలో శంకర్ మరణించడంతో భార్యా, పిల్లలు దిక్కుతోచని వారయ్యారు. ఇద్దరు ఆడ పిల్లలతో ఎలా బతకాలని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసాతో పాటు, కుటుంబానికి ఆదుకుని న్యాయం జరిగేలా చూడాలని మృతుని భార్యా, పిల్లలు కోరుతున్నారు. కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

ఆర్టీసీలో చార్జీల మోత..!