నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యం
– దేశం కోసం, ధర్మం కోసం బీజేపీని గెలిపించాలి
– చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– మార్వాడి సమాజం సంఘాలతో సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రధాని నరేంద్రమోడీతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ ఎంపీ, బీజేపీ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి తాండూరులోని వివిధ మార్వాడి సమాజం సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, పేద, బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రధానమంత్రి సరేంద్రమోడి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందన్నారు. దేశంలో మరోసారి మోడి ప్రధానమంత్రిగా గెలిస్తే దేశ రూపురేఖలు మారడం ఖాయమన్నారు.
దేశం కోసం, ధర్మం కోసం బీజేపీని గెలిపించాలన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో ఏ పార్టీ గెలిచినా కేంద్రం సహాకారం లేనిదే ఏం సాధించుకోలేమన్నారు. ఎన్నికల్లో బీజేపీ నుంచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే చేవేళ్లను అభివృద్ధి చేస్తానని అన్నారు. చేవేళ్ల పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీతో బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, నాయకులు యు.రమేష్ కుమార్, బంటారం భద్రేశ్వర్, మార్వాడి సంఘాల పెద్దలు, యువకులు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

