అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

తాండూరు వికారాబాద్

అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
– మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్
– మైసమ్మ అమ్మవారి ఆలయానికి 25 వేల విరాళం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రజలపై దుర్గామాత ఆశీస్సులు మెండుగా ఉండాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆకాంక్షించారు. సోమవారం తాండూరుు పట్టణం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కార్మికులు చైర్మన్ విఠల్ నాయక్ ను కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ జిల్లా ఆస్పత్రిలో కొలువుదీరిన మైసమ్మ ఆలయ అభివృద్ధి, పూజల కోసం రూ. 25 వేల విరాళం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని అమ్మ వారిని కోరుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో వచ్చే పేషెంట్లు మెరుగైన చికిత్స పొంది సంతోషంగా ఇంటికి వెళ్లాలని అమ్మవారిని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో వినయ్, ప్రభాకర్, రఘు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.