– బైక్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం
తాండూరు, ఆగస్టు 15 (దర్శిని) : తాండూరుకు చెందిన బైక్ మెకానిక్‌లు జాతీయ జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు యూనియన్ కార్యాలయం వద్ద వేడులకను నిర్వహించారు.
యూనియన్ అధ్యక్షులు ఇంతియాజ్ భాయ్ జాతీయ జెండాను ఎగురవేయగా మెకానిక్‌లతో పాటు దేశభక్తులు జాతీయ గీతం ఆలాపించారు. అనంతరం స్వీట్లు పంచి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్, ఉపాధ్యక్షులు ఇబ్రహీం, షరీఫ్, జాయింట్ సెక్రటరి భద్రు, కోశాధికారి విష్ణు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
