చిన్నారుల వ్యాక్సీనేషన్‌కు గ్రీన్ సిగ్నల్
– 2-18 ఏండ్లలోపు వారికి టీకాలు
దర్శిని బ్యూరో: ఇప్పటి వరకు 18 ఏండ్లలోపు వారికి వ్యాక్సీనేషన్ అందించిన కేంద్రం చిన్నారులకు కూడ వ్యాక్సీనేషన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సెప్టెంబర్‌లో చిన్నారులపై కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయిల్స్ పూర్తి కాగా.. వాటి సంబంధించిన ఫలితాలను వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ పరిశీలించింది. దేశీయ తొలి టీకాగా కేంద్రం అనుమతి పొందిన కోవాగ్జీన్‌తో 2, 3 దశల్లో రెండు డోసుల కోవాగ్జిన్‌ను 525 మంది చిన్నారులపై భారత్ బయోటెక్ ప్రయోగాలు జరిపిన సంగతి తెలిసిందే. కోవాగ్జిన్ టీకాను 12 -18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిపై, 6-12 సంవత్సరాలు, అలాగే 2-6 సంవత్సరాల వారిపై మూడు దశల్లో ప్రయోగాలు జరిపారు. 2-18 ఏళ్లలోపు పిల్లలకు కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కీలక అనుమతులు ఇచ్చింది. 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ టీకాను వినియోగించేందుకు ఎక్స్‌పర్ట్ ప్యానల్ సిఫారసు చేసింది.

