హస్తం గెలుపుకు కృషి చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తం గెలుపుకు కృషి చేయండి
– సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేఘనాథ్ గౌడ్
– పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గెలుపుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తాండూరు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్ తో అన్నారు. బుధవారం సంగెంకలాన్ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మేఘనాథ్ గౌడ్ మాట్లాడుతూ చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని తెలిపినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఇంటింటికి ఆరు గ్యారెంటీల అమలును వివరిస్తామన్నారు. ఉచిత విద్యుత్. ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాలతో ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. రైతు రుణమాఫీపై రైతులకు వివరించి కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని కోరుతామన్నారు. తాండూరు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ అందిస్తామన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో జింక మాంసం..!