
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం
– తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమతారెడ్డి
– ఆర్టీసీ డీపోలో ఉద్యోగులకు హెల్త్ ఛాలెంజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమతారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఆర్ఎం రాజు ఆదేశాల మేరకు గురువారం తాండూరు డిపో ఆవరణంలో గ్రాండ్ ఛాలెంజ్ – జనరల్ హెల్త్ ప్రొఫైల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీపో మేనేజర్ సమతారెడ్డి, సీఐ నిర్మల, సూపరింటెండెంట్ రవి కిరణ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక వైద్యులు, వైద్య సిబ్బంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఇతర ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. సంబంధిత వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎం సమతారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగులు, సిబ్బంది కీలకమన్నారు. వారి ఆరోగ్యాలపై ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. డీపోలో ఉన్న ఉద్యోగులు అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అందరూ వైద్య పరీక్షలు చేసుకునేంతవరకు వైద్యం శిబిరం కొనసాగుతుందని తెలిపారు.

ఇదికూడా చదవండి…

