రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మహిళ నాయకులు
తాండూరు, దర్శని ప్రతినిధి : తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డిని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ మహిళ నాయకులు కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకమైన శోభారాణి, పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్‌చారిలు రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో శోభారాణి, మధులతలతో పాటు మండల ఎంపీటీసీ నీలవేణి తదితరులు కూడ ఉన్నారు.

