త్వరలోనే బంగారం లాంటి సాయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
త్వరలోనే బంగారం లాంటి సాయం..!
– కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– లబ్దిదారులకు చెక్కులు అంజేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని పేదింటి పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే బంగారం లాంటి సాయం అందించేందుకు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మండలం, తాండూరు పట్టణంతో పాటు పెద్దేముల్ మండలంలోని కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ నిర్వహించారు.

మొత్తం 237 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా రూ. 2 కోట్ల 37లక్షల 27వేల 492ల విలువైన చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనందిస్తుందని అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద అందించే సాయంతో పేదింటి పెళ్లిళ్లపై ఆర్థిక భారం తగ్గిందన్నారు.

త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తులం బంగారం సాయం అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఎంపీపీ అనితా గౌడ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, విజయాదేవి. బొంబీనా, వెంకన్న గౌడ్, బోయరవి, రాము, నాయకులు ఉత్తమ్ చంద్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కేంద్రంలో మంత్రుల శాఖలు కేటాయింపు