బాడీలో విషాన్ని బైటికి పంపే డ్రింక్..!
– కాలేయ శుద్దికి అద్భుతంలా పనిచేసే పానీయం
– ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకోవచ్చు
దర్శిని డెస్క్ : నేటి ఆధునిక జీవన శైలిలో ఏది పడితే అది తింటూ శరీరంలోకి విషాన్ని పంపించుకుంటున్నాం మనందరం. దీని వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందో ఊహించలేము. ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో విషాన్ని బటయకు పంపించడంతో కీలక పాత్ర పోషించే కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, దానిని శుభ్రం చేయడానికి సద్గురు ఒక సహజ పానీయాన్ని సూచించారు.
వేప ఆకులు, పసుపు, తేనె, నిమ్మరసం కలిపి చేసుకునే ఈ పానీయం కాలేయ శుద్ధికి అద్భుతంగా పని చేస్తుంది. ఈ పానీయాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సద్గురు సూచించిన ఈ డిటాక్స్ పానీయం మన కాలేయాన్ని శుభ్రం చేయడానికి, శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.
ఈ పానీయం వల్ల శరీరంలో కాలేయ శుద్ది జరుగుతోంది. వేప, పసుపు కాలేయాన్ని శుభ్రం చేయడానికి, విష పదార్థాలను తొలగించడానికి సహాయపడతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి, అలసట తగ్గుతుంది. శరీరం లోపల శుభ్రపడటం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
కావాల్సిన పదార్థాలు:
గోరువెచ్చని నీరు (ఒక గ్లాసు), వేప ఆకులు (కొన్ని), నిమ్మరసం (కొద్దిగా), పసుపు (చిటికెడు), తేనె (రుచికి సరిపడా)
ఇలా తయారు చేసుకోవచ్చు
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని వేప ఆకులను వేసి బాగా నానబెట్టండి. లేదా వేప ఆకులను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని నీటిలో కలపండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం, రుచికి సరిపడా తేనె కలిపి బాగా కలపండి. ఈ పానీయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
గమనికః ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకునే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. లెక్క చేయకుండా పాటిస్తే తరువాతి పరిణామాలకు మేము బాధ్యత వహించము.
ఇదికూడా చదవండి…