
ఇంటర్ సప్లిమెంటరీలో సింధూ బాలికల సత్తా
– రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థినిలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటర్ పరీక్షా ఫలితాల్లో తాండూరు సింధూ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ విషయాన్ని సోమవారం యజమాన్యం ఓ ప్రకటకలో తెలిపింది. కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థినిలు ఆఫ్సీన్ ఫాతిమా (బైపీసీ), సఫ్యూయా మెహర్ (సీఈసీ) ఇంప్రూమెంట్ పరీక్షలు రాశారు. విడుదల పరీక్షా ఫలితాల్లో అఫ్సీన్ ఫాతిమా(బైపీసీ-438/440), సఫ్యూయా మెహర్ (సీఈసీ-493/500)లు అత్యుత్తమ మార్కులు సాధించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకర్లుగా నిలిచారు. ఇందుకు కళాశాల వ్యవస్థాపకులు వి.రంగారావు, కరస్పాండెంట్ విజయదేవి, ప్రిన్సిపల్ సంగీతలు విద్యార్థులను అభినందించారు.

ఇదికూడా చదవండి…

