మొదటి విడత ముగిసింది..!
– గల్లి గల్లికి ఎమ్మెల్యేతో వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే
– కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో గల్లి గల్లికి ఎమ్మెల్యే మొదటి విడత కార్యక్రమం బుధవారం సాయంత్రం ముగిసింది. మూడు రోజుల పాటు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి 18 వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి రోజూ ఆరు వార్డులలో పార్టీలకతీతంగా పర్యటించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ఆర్డీఓ అశోక్ కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి ప్రజా సమస్యలను ఆరా తీశారు.
గుర్తించిన చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘ కాలిక సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తామన్నారు. మొదటి విడత కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, నేతలకు, యువకులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేవారం మిగతా 18వార్డులలో రెండో విడత గల్లి గల్లికి ఎమ్మెల్యే ద్వారా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
